కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయని పక్షంలో స్థానిక ఏమ్మెల్యే తన సోంత ఖర్చులతో ఈ సౌఖర్యం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లడుతూ.. గతంలో టీఆర్ఏస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి చేయలేదని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన సొంత ఖర్చుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారని అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం సొంత ఖర్చుతో ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దూర ప్రాంతాల నుండి వచ్చి చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి వారి సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, మండల కార్యదర్శి రాంపేళ్ళి రోహిత్, శివాకేశవ రెడ్డి, గణేష్, రామారపు నాని, పిల్లి బాన్ని, తదితరులు పాల్గొన్నారు.


