epaper
Monday, March 2, 2026
epaper

మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు మాస్టర్ ప్లాన్ వివరాలను సీఎం ముందుంచగా, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.

మేడారం మహాజాతర నాటికి ఆలయ ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు సక్రమంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చూడాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలుపుదలకు చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించండి అని అధికారులకు సూచించారు. మేడారం అభివృద్ధి పనులు వచ్చే 100 రోజుల్లో పూర్తయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ వారం మేడారంకు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని కూడా ప్రకటించారు.

బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలపై కూడా సీఎం పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులలో స్థానిక సెంటిమెంట్‌ను గౌరవించడం, అలాగే స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఆధునిక వసతులు కల్పించాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎంవారి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌తో పాటు పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img