epaper
Monday, March 2, 2026
epaper

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశం.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగా బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజలకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని గుర్తు చేశారు.

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో చరిత్రాత్మక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నుండి సన్నబియ్యం పంపిణీ వరకు అనేక పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. కామారెడ్డి లో జరిగే భారీ బహిరంగ సభలో లక్షల మంది పాల్గొని కాంగ్రెస్ శక్తిని చాటుతారని అన్నారు.

ఇక రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఓటు చోరీలపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నారని తెలిపారు. మోదీ, అమిత్ షా పదవే పరమావధిగా భావించి ఓటు దోపిడీకి పాల్పడతారని, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో దానికి ఉదాహరణ ఉందని అన్నారు. నైతిక విలువలు లేని ఈ చర్యలను రాహుల్ గాంధీ ఎప్పటికీ సహించరని స్పష్టం చేశారు. ఓటు చోరీల వల్లే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

ఉద్యోగాల విషయమై బీజేపీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వాస్తవానికి ఉద్యోగాల కల్పన పరిస్థితి దయనీయంగా ఉందని, ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు సమీపించగానే బీజేపీ నాయకులు దేవుళ్ల పేర్లు చెప్పి ప్రజలను మభ్యపెడతారని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా దేవుళ్ల పేర్లు వాడి గెలిచారని, కానీ దేవుళ్లకు బీజేపీ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని గట్టి విమర్శలు చేశారు.

2029 ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు. కవిత స్టేట్‌మెంట్‌తో కేసీఆర్ కుటుంబం దోపిడీ బట్టబయలైందని, కేసీఆర్ కుటుంబం దొంగల ముఠాగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్లలో డీజిల్ పోసుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం అవినీతి సొమ్ముతో వందల కోట్లకు పడగలెత్తిందని ఎద్దేవా చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. ప్రజలతో ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని, మీనాక్షి గాంధీ నిజాయితీకి నిలువెత్తు రూపమని కొనియాడారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img