కాకతీయ, నెల్లికుదురు : ద్విచక్ర వాహనంపై నుంచి పడి చికిత్స పొందుతూ మండలానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఎస్సై చిరా రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ఆరెంధుల సత్యనారాయణ (66) దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి శివారులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో బలమైన గాయాలు కాగా 108లో హాస్పిటల్ కు పంపగా మృతుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కొడుకు ఆరెందుల ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.


