కాకతీయ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఆదివారం జంపన్న వాగులో మునిగి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం జనగామ జిల్లాకు చెందిన కన్నెగంటి మనీష్ శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి మేడారం వచ్చాడు. ఆదివారం ఉదయం జంపన్న వాగులో ఊరట్టం వెళ్లే బ్రిడ్జి వద్ద స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు.
స్నేహితులు ఎంత వెతికినా దొరక్కపోవడంతో ఈ విషయం తహసీల్దార్ సురేష్ బాబు, సెకండ్ ఎస్‌ఐ మధుకర్‌కు తెలియజేయగా, ఎన్టీఆర్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం దొరకలేదు. చివరికి మేడారానికి చెందిన వట్టం రమేష్, మల్లెల ప్రణయ్, పూసల రవి తదితరులు గాళాలు వేసి, ఐదు గంటల కష్టపడి మనీష్ మృతదేహాన్ని బయటకు తీశారు.


