కాకతీయ ఇనుగుర్తి : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు పురుడు పోశారు 108 సిబ్బంది. మహబూబాబాద్ జిల్లా మండలం ఇనుగుర్తి, పెద్ద తండకు చెందిన నూనవత్ యాకమ్మ(36), నిండు గర్భవతి. ఆదివారం ఉదయం సమయంలో యాకమ్మకు పురిటి నొప్పులు వస్తుండడంతో సహాయం కోసం 108 అంబులెన్స్ కాల్ చేశారు.
అంబులెన్స్ సిబ్బంది ఇంటికి చేరుకునే సమయంలో యాకమ్మకు పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో సిబ్బంది అంబులెన్స్ లోనే పురుడు పోశారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన నూనవత్ యాకమ్మ ను మహబూబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.
పురిటి నొప్పులతో బాధపడుతున్న యాకమ్మను సరైన సమయంలో వైద్య సహాయం అందించిన అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి ప్రభాకర్, పైలెట్ వెంకన్న లను కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు


