*జిల్లా రైతు సహకార సంఘాల సొసైటీలో రాజకీయ రంగు ..!
*రైతులకు అందని యూరియా.. !
*ప్రభుత్వంను అబాసు పాలు చేస్తున్న సొసైటీ ప్రజాప్రతినిధులు…!
కాకతీయ, మహబూబాబాద్: జిల్లాలో రైతుల సహకారంతో, రైతు సంఘాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తొలి రోజుల్లో, సహాకార సంఘం కార్యాలయంలో రాజకీయం ఏమాత్రం లేదని పలువురు తెలుపుతున్నారు. జిల్లాలో 18 సహకార సంఘాలు ఉన్నాయి. సభ్యులూగా సుమారుగా 90 వేల వరకు ఉన్నారు.ప్రతి సంవత్సరం పంట రుణాలు ,బంగారు రుణాలు, ఇతర సేవలను రైతులకు ప్రభుత్వం, పాలకులు పలు తీర్మానాలు చేసి , నాబార్డ్ ఇతర సంస్థల ద్వారా అమలు చేస్తున్నారు. ఈ మద్య కాలంలో డైరెక్టర్ లు, చైర్మన్ లు రాజకీయాలు చేస్తూ, రైతుల సేవలను రాజకీయాలకు వాడుకుంటున్నారని , జిల్లా వ్యవసాయ, అధికారుల ,మండల అధికారుల మాటలను లెక్క చేయకుండా వారి ఇష్టాను, రీతిలోవ్యవహరిస్తున్నట్లు ,జిల్లాలో పలువురు రైతులు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.
యూరియా కొరత…! సొసైటీ ల పాపమేనా..?
జిల్లాలో ని సహకార సంఘాలకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఎరువులు, విత్తనాలు పంపిణి చేస్తున్నారు.గత పక్షం రోజులుగా వ్యవసాయ అధికారుల మాటలు పెడచెవిన పెడుతూ క్రిబ్ కో సంస్థ నుండీ యూరియా సోసైటీల గోడౌన్ లకు వేల టన్నులు వచ్చింది.యూరియా పంపిణీ లో ఎవరు స్తానిక రైతులు ఎవరు, ఇతర ప్రాంత రైతులు ఎవరు, వచ్చిన రైతులను పర్యవేక్షణ చేయకుండానే , ప్రజాప్రతినిధులు చైర్మన్ లు అండతో సోసైటీ నిర్వాహకులు , ఎరువులను పంపిణీ చేశారు . క్షేత్ర స్థాయిలో 2025-26 ఖరీఫ్ పంట కాలానికి అధికారుల ఇండెంట్ ఆధారంగా ఎరువులు దిగుమతి అయినట్లు వ్యవసాయ అధికారులు లెక్కలు వెల్లడి చేస్తున్నారు. అందుకు భిన్నంగా సాగు రైతులకు కావాల్సిన యూరియా వారికి అందుక పోవడంతో సొసైటీ సెంటర్ ల వద్ద జనం బారులు తీరుతూ రైతులు ఇబ్బందులు,పడుతున్నట్లు,యూరియా పై రోజు కో వార్త జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులలో చెడ్డ పేరు..?
దీనితో గ్రామాలలో వ్యవసాయం కోసం యూరియా పై మునుపెన్నడూ లేని విధంగా ,ప్రభుత్వం చర్యలపై రైతులలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సొసైటి చైర్మన్ నిర్వాహకులతో కాంగ్రెస్ ప్రభుత్వంనకు చెడ్డ పేరు ప్రచారంలో ఉంది. సొసైటీ వారు ఆధార్ కార్డు ఆధారంగా యూరియా పంపిణి చర్యల్లో ,అనేక అవకతవకలు జరుగుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
వ్యవసాయ పర్యవేక్షణ లేక యూరియా కొరత..!
ఇప్పటికైనా జిల్లాలోని సాగు రైతులకు పట్టా పాస్ పుస్తకం ,భూమి వివరాల ఆధారంగా శాస్త్రీయంగా ఎంత అవసరమో,అంత రైతులకు పంపిణీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.దీని వలన యూరియా బ్లాక్ మార్కెట్ తరలి పోకుండా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో సోసైటి గోడౌన్ లలో స్టాక్ పర్యవేక్షణ కొనసాగాలని రైతులు కోరుతున్నారు.


