epaper
Monday, March 2, 2026
epaper

బీహార్ లో అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ నజర్.. ఆ తర్వాతే సీట్ల పంపకాలు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడంపై నజర్ పెట్టింది. ఆ తర్వాత మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలని కమల పార్టీ భావిస్తోంది. దీర్ఘకాలంగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండటంతో రాష్ట్రంలో సహజంగా నెలకున్న వ్యతిరేకత కూడా బీజేపీకి ఇబ్బందిగా మారింది. గతవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకులు ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను ముగించేందుకు ఆయన సూచనలు చేశారు.

పార్టీ సీనియర్ నాయకత్వంలో అభిప్రాయబేధాలు నెలకున్నాయి. గతంలో ఉన్నా ఎన్నికల ముందు అవి సర్దుమనిగేవి. మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఉన్నప్పుడు ఎన్నికల వేళ ఆయన మాటను అంతా ఆమోదించేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ నాయకత్వం వారి వ్యక్తిగత అజెండాతో నడుస్తోందని ఓ సీనియర్ నాయకుడు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.

ఇక సీట్ల పంపకంపై జేడీయూ స్పష్టమైన అజెండాతో ముందుకు వస్తోంది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ కంటే కనీసం ఒక సీటు ఎక్కువ రావాలని డిమాండ్ చేస్తోంది. తమ రాజకీయ బలం, ‘సీనియర్ పార్ట్నర్’ ఇమేజ్‌ దృష్ట్యా ఇది న్యాయసమ్మతమని జేడీయూ వర్గాలు అంటున్నాయి. అయితే బీజేపీ ఈ డిమాండ్‌ను అంగీకరించడానికి ఇష్టపడకపోవడం వల్ల చర్చలు స్తబ్ధతలో పడ్డాయి. మరోవైపు, లోక్ జనశక్తి పార్టీ (చిరాగ్ పస్వాన్ నేతృత్వంలో) కూడా ఎక్కువ సీట్లు కావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో ఎన్డీఏలో భాగస్వాముల మధ్య సీట్ల చర్చలు మరింత క్లిష్టంగా మారాయి.

సీట్ల లెక్కలో బీజేపీ ప్రధాన పార్టీ అయినప్పటికీ, మిత్రపక్షాల ఒత్తిడి వల్ల తుది నిర్ణయం ఆలస్యం అవుతోంది. జేడీయూ, ఎల్‌జేపీ డిమాండ్లకు బీజేపీ ఎలా ప్రతిస్పందిస్తుందన్నదే రాబోయే ఎన్నికల్లో ఎన్‌డీఏ సమీకరణలకు కీలకం కానుంది. అంతర్గత పోట్లను తగ్గించి, సీట్ల పంపకంపై స్పష్టత తీసుకురాకపోతే, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ బలహీనమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బీజేపీ, ముందుగా రాష్ట్ర నాయకుల మధ్య ఐక్యతను తీసుకువచ్చి, ఆ తర్వాతే సీట్ల పంపకంపై స్పష్టమైన ఫార్ములా ప్రకటించాలని వ్యూహం వేసుకుంటోంది.

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img