కాకతీయ,గీసుగొండ: కెనాల్ కాల్వలో పడిన స్నేహితుడిని కాపాడబోయి యువకుడు గల్లంతయిన ఘటన వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గీసుగొండ సిఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం… మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఎర్రం పూర్ణచందర్ (19) గ్రామంలోని మేకలబండ వినాయక మండపం వద్ద ఉండగా అతని స్నేహితులైన కాలే రాకేష్, నక్కినేని భరత్ లు పూర్ణచందర్ ను వారి టూ వీలర్ పై ఎక్కించుకొని గ్రామ శివారులోని కెనాల్ బ్రిడ్జి దగ్గరికి వెళ్లి మద్యం తాగిన అనంతరం కాలే రాకేష్ కెనాల్ బ్రిడ్జిపై నిలబడి మూత్రం పోస్తుండగా సొలిగి కెనాల్ లో పడగా పూర్ణచందర్ అతడిని కాపాడడానికి కెనాల్ లో దూకగా ప్రవాహంలో కొట్టుకెళ్ళాడు. సొలిగి కెనాల్ లో పడ్డ రాకేష్ ఈదుకుంటూ కెనాల్ నుండి బయటకు వచ్చాడు. కానీ రాకేష్ ని కాపాడడానికి కెనాల్లో దూకిన పూర్ణచందర్ నీటి ప్రవాహంలో కొట్టుకు వెళ్లాడని పూర్ణచందర్ తండ్రి ఎర్రం రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, గాలింపు చర్యలు చేపట్టినట్టు సీఐ తెలిపారు.
స్నేహితుడిని కాపాడపోయి యువకుడు గల్లంతు ..వినాయక నిమజ్జనం వేళ అపశృతి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


