కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాల నిర్వహణకు పాటుపడిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సహా అన్ని శాఖల సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
హిందువులంతా ఒకే వేదికపై వచ్చి ధార్మిక వాతావరణంలో నిమజ్జనోత్సవాలను జరుపుకోడం చాలా సంతోషంగా ఉందని, స్వచ్ఛందంగా కౌంటర్లు ఓపెన్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదాల వితరణ, మంచి నీళ్ల కౌంటర్లను ఏర్పాటు చేసి సేవ చేసిన వివిధ సంస్థలు, వ్యాపారులు, సంఘాలు, ధార్మిక సంస్థలకు అభినందనలు తెలిపారు. హిందువులంతా ఏకమై ఉత్సవాలు నిర్వహించడంలో కరీంనగర్ స్పూర్తిదాయకంగా నిలుస్తోందని ప్రకటనలో బండి సంజయ్ పేర్కొన్నారు.


