కాకతీయ, నెల్లికుదురు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఓటర్ జాబితాను విడుదల చేసినట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. శనివారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 40,471 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 20,019, స్త్రీలు 20, 451, ఇతరులు 1 ఉన్నారని తెలిపారు.
మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలుండగా మేచరాజుపల్లి 3181, ఎర్రబెల్లిగూడెం3576, కాచికల్లు4288, నైనాల4152, రాజుల కొత్తపెళ్లి2452, శ్రీరామగిరి3715, ఆలేరు2952, వావిలాల2282, నెల్లికుదురు3754, బ్రాహ్మణ కొత్తపెళ్లి1648, మదనతుర్తి3065, మునిగిలవేడు2375, నరసింహుల గూడెం3031 ఓటర్లు కలిగి ఉన్నారని చెప్పారు. సోమవారం ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల పై మండల పరిషత్ లో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుందని తప్పక అందరూ హాజరుకావాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఓటర్ జాబితా విడుదల చేసినట్లు తెలిపారు.


