కాకతీయ, ములుగు : ములుగు జిల్లా పాలంపేటలోని ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని జర్మనీ పర్యాటకులు జీస్టాస్, నిమాన్ సందర్శించారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి ఆకర్షితులైన వారు దేవాలయంలోని సుందర శిల్పాలు, గోపుర నిర్మాణాలు, రాతి స్తంభాలపై చెక్కిన శిల్పకళను ఆసక్తిగా వీక్షించారు.
800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇంకా అద్భుతంగా నిలిచి ఉందన్నారు. దేవాలయం గైడ్ వారికి ఆలయ నిర్మాణ విశిష్టతను వివరించారు. కాకతీయుల కళా నైపుణ్యం తమకు ఆశ్చర్యం కలిగించిందని జీస్టాస్, నిమాన్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులు రావడానికి వీలుగా ప్రభుత్వం సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.


