కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలో శనివారం విజ్ఞాన్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు తమ గురువు కీర్తి శేషులు వెనగండ్ల మురళీమోహన్ జ్ఞాపకార్థం గా 190 మంది విద్యార్థులకు సుమారు పదివేల విలువచేసే పలకలు, నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ విజ్ఞాన్ పాఠశాల కేవలం పుస్తకాలు చదివే చోటు కాదని, మంచి మనిషిగా మార్చే స్థలం అని, జ్ఞానం అంటే కేవలం మార్కులు కాదు, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన అని తెలిపారు.
ఇది తమకు ఇప్పుడు నిజజీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడిందని, గతంలో వారు గడిపిన పాఠశాల జీవితాన్ని, తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంజి అర్చనరెడ్డి, ఉపాధ్యాయులు చంద్రమోహన్, నిర్మల, స్వప్న ,సుజాత, రమాదేవి, పూర్వ విద్యార్థులు శ్రీరామ్ హర్షవర్ధన్, రామగిరి శశికుమార్, దేవులపల్లి గవాస్కర్, రామగిరి అఖిల్, పురోహిత్ ఉమేష్, వెనగండ్ల హర్షవర్ధన్, అభిరామ్, దేవులపల్లి రీతు, బేతమల్ల పూజిత తదితరులు పాల్గొన్నారు.


