కాకతీయ, నెల్లికుదురు: మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఫర్టిలైజర్ షాపు2 ముందు యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి భారీగా తరలి వచ్చి క్యూలైన్ లో నిల్చున్నారు. రైతులను చూసిన ఆగ్రోస్ 2 యజమాని రఘుపతి రైతు వేదిక దగ్గర యూరియా టోకెన్లు ఇస్తామని రైతులకు చెప్పడంతో రైతులు అక్కడకు వెళ్లి క్యూలైన్ ఉన్నారు.
ఆగ్రోస్ యజమాని ఊరు చివర మట్టి దిబ్బపై నిల్చోని యూరియా టోకెన్లు ఇస్తాం, అందరూ లైన్లో ఉండాలని చెప్పడంతో రైతులు అక్కడికి కూడా వెళ్లి నిలబడడంతో షాపు యజమాని యూరియా టోకెన్లను విసిరివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇంత ఓపికగా నిలబడుతూ ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్లి క్యూ లైన్ లో నిలబడుతున్నా ఆగ్రోస్ 2 యజమాని ఆధార్ కార్డు, పాస్ బుక్ జిరాక్స్, టోకెన్లు తమ మీదకు విసిరివేయడం ఎంతవరకు సమంజసమని, యజమాని కావాలనే రాద్ధాంతం చేశారని రైతులు ఆరోపించారు.


