కాకతీయ, బయ్యారం : గంగారం మండలం పందెం గ్రామానికి చెందిన బచ్చల రవి (38) ఈనెల 3న గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో ఉమ్మేలేరు వాగులో గల్లంతయినట్లు తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు వాగులో వెతికారని ఎస్సై తిరుపతి తెలిపారు.
వారి కథనం ప్రకారం బయ్యారం మండల సరిహద్దులోని వాగులో శుక్రవారం బచ్చలి రవి శవాన్ని స్థానికులు గుర్తించినట్లు తెలిపారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.


