కాకతీయ, వరంగల్ : దేశ ప్రజలకు నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో వాటిపై జీఎస్టీ తగ్గించినందుకు బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో వరంగల్ కాశిబుగ్గ జంక్షన్ లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గంట రవికుమార్ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని దేశవ్యాప్తంగా తగ్గిస్తూ జిఎస్టి 2.0 అమలు చేయడం సామాన్యులకు ఇదొక గొప్ప వరం అని అన్నారు.
నూతన జీఎస్టీ వలన జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియం పై జీఎస్టీ రద్దు చేస్తూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య, ఆర్థిక భద్రత అందుబాటులోకి ఉంటుందన్నారు. పాలు, పనీర్, మందులు, పాఠశాల సామగ్రి, వ్యవసాయ పరికరాలు, ఎరువులపై 0% లేదా 5% జీఎస్టీ కేటాయించడంతో విద్యార్థులకు, రైతులకు భారీ ఉపశమనాన్ని కలిగిస్తుందన్నారు. టీవీలు, ఫ్రీజ్ లు, ఏసీలపై జీఎస్టీ 18%, అలాగే హోటల్, సినిమా టికెట్లు కేవలం 5% తో మధ్యతరగతి కుటుంబాలకు ధరలు అందుబాటులో ఉంటాయని అన్నారు.
ఈ నూతన సంస్కరణలు సాధారణ, మధ్యతరగతి ప్రజల జీవితాన్ని బలపరచడమే కాకుండా రైతులను శక్తివంతం చేస్తూ, ఎంఎస్ఎంఈలకు మద్దతు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని వికసిత భారత్ 2047 వైపు వేగంగా నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకటరమణ, నాయకులు కుసుమ సతీష్, తాబేటి వెంకట్ గౌడ్, సముద్రాల పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


