కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని పోచమ్మవాడలో కోతుల బీభత్సం సృష్టించాయి. తాళ్లపల్లి సారయ్య అనే వ్యక్తి పై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గతంలో కూడా ఇలాంటి దాడులు అనేకసార్లు జరిగి పలువురు గాయపడ్డారు, అయినప్పటికీ అధికార యంత్రాంగం ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పై ప్రజలు తీవ్ర అగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి రోజు కోతుల భయం మధ్యనే జీవించాల్సి వస్తోంది, పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు అని స్థానికులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కోతులను అరికట్టే దిశగ చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ వాసులు కోరుకుంటున్నారు


