కాకతీయ, గీసుగొండ: గణేష్ నిమజ్జనానికి అన్ని విధాలుగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మల్లన్న చెరువును సందర్శించి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మామూనూర్ ఎసిపి వెంకటేష్, గీసుగొండ సీఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


