కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను గురువారం అదరపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ రాజకీయ పార్టీ ప్రతినిధిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఏం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈవీఏంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బిఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బిజెపి పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం పార్టీ ప్రతినిది బర్కత్ ఆలీ, టీడీపీ పార్టీ ప్రతినిది కళ్యాడపు ఆగయ్య, బి.ఎస్.పి పార్టీ ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.


