కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. నగరంలో మాదాపూర్ లోని మైహోం భుజా గణేస్ డ్డూకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డు బ్రేక్ చేస్తోంది. తాజాగా మాదాపూపర్ మై హోం భుజా లడ్డూ ఈ ఏడాది కూడా అధిక ధర పలికింది.
ఈ ఏడాది కూడా హోరా హోరీ లడ్డూ వేలం పాటు సాగగా..రూ. 51,77,777కు పలికింది. ఈ ఏడాది లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కైవసం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇల్లందుగ్రామ వాసి. గత ఏడాది రూ. 29లక్షలు పలికింది ఈ లడ్డూ.


