కాకతీయ, నల్లబెల్లి: రేపు (శుక్రవారం) ఎల్లుండి (శనివారం) జరగబోయే వినాయక నిమజ్జన ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ శాఖ ప్రజలను శాంతియుత వాతావరణంలో ఉత్సవాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ప్రజల సహకారంతో వినాయక నిమజ్జన ఉత్సవాలు విజయవంతంగా జరగాలని అధికారులు కోరుతున్నారు


