కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని వావిలాల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ఎంపీయూపీఎస్ వావిలాల లో లైన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సేవా సమితి ఆధ్వర్యంలో లయన్ వజినపల్లి శైలజ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు బుక్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ సేవా తరుణి తోర్రూర్ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి, శారద ఉమాలు పాల్గొని విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు మెటీరియల్ అందజేస్తూ అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోచదువుతున్న పిల్లలకు ఇలాంటి సహకారం అవసరం అన్నారు.
చదువుతోపాటు క్రమశిక్షణ, మంచి ఆచారాలు అలవాటు చేసుకోవాలని భవిష్యత్తులో పెద్దలుగా ఎదిగి గ్రామానికి, సమాజానికి పేరు తెచ్చేలా చదవాలి” అని సూచించారు. సమాజంలో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి అవసరమైన సదుపాయాలు అందించడం లయన్స్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాం అని తెలిపారు. కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్, కస్పూల్ వరా, సంతోష్, నవీన్, రజనీ, ప్రవీణ్ కుమార్. అంగన్ వాడీ టీచర్ రాజ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ బొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.


