కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నేత కవిత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపినట్లు తెలిసింది. ఈ లేఖను బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చినట్టు అధికార ప్రతినిధులు ధృవీకరించారు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యకలాపాల్లో కవితకు పెద్దగా పాత్ర లేకపోవడం, తన రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలు జరుపుకోవడం వంటి అంశాల మధ్య ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కవిత రాజీనామాతో బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితకు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా, ఆమె ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై రాజకీయ విశ్లేషకులు, పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఇకపై కవిత రాజకీయ ప్రస్థానం ఏ దిశగా సాగుతుందనే అంశంపై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.


