కాకతీయ, తెలంగాణ బ్యూరో : బెంగుళూరులో జరిగిన నాలుగో సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్, 2025లో విజేతలైన ఆటగాళ్లు, మాస్టర్స్‌కు గాంధీభవన్‌లో తెలంగాణ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు.
ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన ఆటగాళ్లు 8 బంగారు, 6 వెండి, 8 కాంస్య పతకాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టారని మహేష్ గౌడ్ అన్నారు. ఆటగాళ్ల కృషి, మాస్టర్స్ శ్రమకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఛాంపియన్‌షిప్ విజేతలకు తెలంగాణ కరాటే అసోసియేషన్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే కీయో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్‌ను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. 2027లో జరగబోయే ఆసియన్ కరాటే ఛాంపియన్ షిప్‌ను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


