కాకతీయ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకలపల్లి గ్రామ అనుములపల్లెకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఏస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారికి బీఆర్ఏస్ తరపున మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలని, గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత 20 నెలలుగా నల్లబెల్లి మండలంలో ఒక్క కొత్త రోడ్డు పనులు కూడా ప్రారంభం కాలేదని, తాను తెచ్చిన రోడ్లను కూడా ప్రస్తుత ఎమ్మెల్యే రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతు భరోసా బకాయిలను తక్షణం చెల్లించాల్సిందిగా, అలాగే అసంపూర్ణంగా ఉన్న రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీలు, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.


