కాకతీయ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో టాస్క్ రీజనల్ సెంటర్ ఉచితంగా పలు టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న టాస్క్ సెంటర్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టాస్క్ రీజినల్ సెంటర్ ఇంచార్జీ టి.కౌసల్య మంగళవారం తెలిపారు.
జావా వెబ్ డెవలప్‌మెంట్, పైథాన్, సీ, సీ++, హెచ్‌టిఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్,టాలీ విత్ జీఎస్‌టీ, ఆప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్ వంటి ముఖ్యమైన కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌసల్య సూచించారు.
టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి మంచి జీతాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 4లోపు టాస్క్ సెంటర్లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 90595 06807 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.


