అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
భావి పౌరుల భవిష్యత్తులో అంగన్వాడిలదే ప్రధాన భూమిక
మెరుగైన సేవల కోసం మొబైల్ ఫోన్ల పంపిణీ
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ : భావిపౌరుల భవిష్యత్తును నిర్మించడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మండలంలోని కొనయిమాకుల రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సంగెం, గీసుగొండ మండలాల అంగన్వాడీ టీచర్లకు జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి సేవలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను అందజేస్తోందని చెప్పారు.ఈ ఫోన్ల ద్వారా పిల్లల వివరాలు, గర్భిణీ స్త్రీల సమాచారం, పోషకాహార కార్యక్రమాల పర్యవేక్షణ సులభంగా జరుగుతుందని పేర్కొన్నారు.అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,డిఆర్ఓ విజయ లక్ష్మి,డిడబ్ల్యుఓ రాజమణి,తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్,ఎంపీడీఓ కృష్ణవేణి, జిపిఓలు తదితరులు పాల్గొన్నారు.


