కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవితపై వేటు పడిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధికారికంగా స్పందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానిస్తూ.. హరీష్‌రావు, సంతోష్ వెనుక రేవంత్ ఉన్నాడనేది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమే. కాళేశ్వరంపై లోతైన విచారణ జరగాలి. కాంట్రాక్టర్ల వ్యవహారంపైనా సమగ్రంగా దర్యాప్తు జరగాలన్నారు.
రాజకీయ నేతలను మాత్రమే బలిపశువులుగా చేయడం సరికాదని ఆయన విమర్శించారు. కొందరు అధికారుల దగ్గర వందల కోట్లు బయటపడుతున్నాయి. అలాంటి అధికారులపై చర్యలు ఏంటి? అని ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలను ఖండించిన దానం నాగేందర్, నాకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. దానం నాగేందర్ మాత్రం అసలైన అవినీతిని వెలికితీయాలని డిమాండ్ చేశారు.


