ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి
అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : కలెక్టర్ చిత్రా మిశ్రా
చిగురు మామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవఖాన తనిఖీ
కాకతీయ, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవలపై పేషంట్లతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సేవలు ఎలా ఉన్నాయి.. అని ఆరా తీశారు. అదేవిధంగా వైద్యులతోనూ మాట్లాడారు. ప్రజలు మెచ్చే విధంగా వైద్య సేవలు అందించాలని అప్పుడే వైద్యులకు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. దీంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. పేషంట్లకు బాధ్యతయుతంగా వైద్య సేవలు అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసీ ఓపి గది ఇతర విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా పక్కనే ఉన్న పల్లె దవాఖాన ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ వైద్య సేవలపై అటు ప్రజలు ఇటు అధికారులతోనూ మాట్లాడారు.. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రెండు చోట్ల మందులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జగదీశ్వర్ తహసిల్దార్ రమేష్ వైద్యాధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


