epaper
Thursday, April 9, 2026
epaper

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు
ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణం
మార్క్‌ఫెడ్ అధికారుల తీరుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి ధ్వ‌జం

కాకతీయ,ఖమ్మం : మొక్కజొన్న కొనుగోళ్లలో ఎటువంటి షరతులు పెట్టకుండా ప్రతి గింజను సేకరించాలని, ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. గురువారం జిల్లాలోని కొనిజర్ల, వైరా మండలాల్లో మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని స్పందిస్తూ ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి పెరిగి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చినా మార్కెట్‌లో సరైన మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర 1700 నుండి 1800 వరకు మాత్రమే పలుకుతోందని, ఇది రైతులకు కనీస పెట్టుబడి కూడా రాని పరిస్థితి తీసుకువస్తోందని పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువస్తే మార్క్‌ఫెడ్ అధికారులు ఫంగస్, సన్నాల పేరుతో కొర్రీలు పెడుతూ కొనుగోళ్లు నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పంట నాణ్యత బాగున్నప్పటికీ అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ చైర్మన్ జోక్యం చేసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని కోరారు.

వర్షాల కారణంగా రైతుల ఆందోళన

అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా కల్లాల్లో ఉన్న మక్కలు తడిసి నష్టపోతున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం జరగడంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షానికి తడిసిన గింజలను దళారులు కొనరని, ఒకవేళ కొన్నా చాలా తక్కువ ధరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మార్క్‌ఫెడ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తడిసిన పంటను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మందడపు సుబ్బారావు, బండారు నరేష్, కావిడ మురళీకృష్ణ, యాస సత్యనారాయణ, కవిడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య...

కాకతీయ రిపోర్టర్‌ను చంపేయాలి

కాకతీయ రిపోర్టర్‌ను చంపేయాలి కొత్తగూడెం నుంచి మనుషులను మాట్లాడు స్కూల్ పర్మిషన్ గురించి...

హస్పుఖాన్ భవనం కూల్చివేత

హస్పుఖాన్ భవనం కూల్చివేత రాయిగూడెం గ్రామంలో కూల్చివేతపై ముస్లింల‌ ఆగ్రహం కాకతీయ, కూసుమంచి :...

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..! ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..? తప్పుడు...

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్ నిర్వ‌హ‌ణ‌లేని గ్రామ డంపింగ్ యార్డ్ కాకతీయ, ఏన్కూర్ :...

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కాకతీయ ఖమ్మం టౌన్ :...

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి పోనేక‌ల్లులో అత్యాధునిక వసతులతో భ‌వ‌న నిర్మాణాలు చదువు తో...

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ అత్యవసర సేవల నాణ్యతపై సమగ్ర పరిశీలన క్వాలిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img