epaper
Thursday, April 9, 2026
epaper

కాకతీయ రిపోర్టర్‌ను చంపేయాలి

కాకతీయ రిపోర్టర్‌ను చంపేయాలి
కొత్తగూడెం నుంచి మనుషులను మాట్లాడు
స్కూల్ పర్మిషన్ గురించి తల్లిదండ్రులకు అవసరమా?
వార్త‌లు రాస్తే మాత్రం త‌ల్లిదండ్రుల‌కు చ‌దువు వ‌చ్చా?
గ‌తంలో అనుమ‌తి లేదు.. ఇప్పుడు వచ్చింది.. అయితే ఏంటి?
మణుగూరు కాక‌తీయ రిపోర్ట‌ర్‌కు రాధిక కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ బెదిరింపులు
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు… లీగల్‌గా చూసుకోమన్న సీఐ
ఇప్పటికైనా జిల్లా యంత్రంగా కదలాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు, మీడియా ప్ర‌తినిధులు

కాకతీయ, మణుగూరు: ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించినా భయం లేదు. తల్లిదండ్రులను మోసం చేసినా బెరుకు లేదు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినా కనికరం లేదు. అనుమ‌తుల్లేకుండా మూడేండ్లుగా పాఠ‌శాల‌ను నిర్వ‌హిస్తూ విద్యార్థులను మోస‌గించ‌డ‌మేగాక‌, ఇదే విష‌యాన్ని ఆధారాల‌తో స‌హా వెలుగులోకి తీసుకొచ్చిన కాక‌తీయ ప‌త్రిక విలేక‌రిపై బెదిరింపుల‌కు దిగ‌డం.. చంపేస్తామ‌ని హెచ్చ‌రించ‌డం రాధిక కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ నిజ స్వ‌రూపాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది. గ‌తంలో ప‌ర్మిష‌న్ లేదు.. ఇప్పుడు తెచ్చుకున్నాం.. అయితే ఏంటి? అంటూ దురుసుగా స‌మాధానం ఇవ్వ‌డం యాజ‌మాన్యం అహంకారానికి ప‌రాకాష్ట‌గా నిలుస్తోంది. అసలు అనుమ‌తుల గురించి తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం తమకు ఏముంది.. వార్త‌లు రాస్తే పోయేదేముంది.. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు చ‌దువు వ‌చ్చా..? అంటూ వెకిలి ప్ర‌శ్న‌లు వేయ‌డం ప్రిన్సిపాల్ త‌ల పొగ‌రును సూచిస్తోంది.

ప్రిన్సిపాల్ నరేష్ బేరసారాలు

ఎంత కావాలో చెప్పు అన్న…? వార్తలు రాయకు అన్న.. ప్లీజ్ ! సాయంత్రం వచ్చి కలుస్తా.. ఇది రాధిక స్కూల్ ప్రిన్సిపాల్ నరేష్ బాగోతం. లోన లోటారం.. పైన పాటారం అన్న చందంగా ఉంది మణుగూరు రాధిక స్కూల్ వ్యవహారం. రాధిక స్కూల్ కి అన్ని పర్మిషన్లు ఉన్నాయని, మా మీద కావాలనే వార్తలు రాస్తున్నారని మీడియా ముందు మాట్లాడిన ప్రిన్సిపాల్ నరేష్ మరి కాకతీయ రిపోర్టర్‌తో కాళ్ల బేరానికి వ‌చ్చి బేరసారాల‌కు దిగ‌డం ఎందుకో..? గురువారం ఉదయం సుమారు 8:53 సమయానికి కాల్ చేసి రాజీవ్ గాంధీ నగర్ మార్కెట్ గోదాం నందు సెటిల్మెంట్ చేసుకుందాం అన‌డం దేనికి సంకేతం. అందితే జుట్టు … లేదంటే కాళ్లు .. అన్న విధంగా రాధిక స్కూల్ యాజమాన్యం వ్యహరిస్తున్న తీరు సంచ‌ల‌నంగా మారింది.
ఈక్ర‌మంలోనే … స్థానిక అంబేద్క‌ర్ సెంటర్‌లో ఎనిమిది మంది వ్యక్తులు మాట్లాడుకుంటూ… రిపోర్టర్ సతీష్‌ని చంపేయాలి. వాడి వల్ల ఇబ్బంది అవుతుంది.. రాధిక స్కూల్ మీద వార్తలు రాస్తున్నాడు. వాడిని ఏ విధంగా అయిన ఏసేయాలి. కొత్తగూడెం జిల్లా నుంచి మనుషులను మాట్లాడాలి.. అని చ‌ర్చించుకోవ‌డం చర్చనీయాంశంగా మారింది.

పోలీస్ స్టేషన్ రాధిక స్కూల్ ఫిర్యాదు

మూడు, నాలుగు సంవత్సరాలు రాధిక స్కూల్ కు ఎటువంటి అనుమ‌తులు లేకుండా నడిపించారని, ఒక ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్‌లో రెండు విద్యా సంస్థ‌లు నడుస్తున్నాయని, స్టడీ కండెక్ట్, టీసీల మీద శ్రీవిద్య స్టాంపులు వేసి రాధిక స్కూల్ యజమాని సంతకాలు చేస్తున్నారని కాకతీయ దినపత్రికలో వ‌రుస కథ‌నాలు ప్ర‌చురిత‌మైన సంగ‌తి తెలిసిదే. దీనిపై స్కూల్ యాజ‌మాన్యం బుధవారం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారని తెలిసింది. డీఎస్పీ ఆ ఫైల్‌ను సీఐకు రిఫర్ చేయ‌గా గురువారం ఇరువురిని పిలిపించి విషయాలు అడిగి తెలుసుకున్నారు. పూర్వి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత సంబంధిత విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి రాధిక స్కూల్‌కి ప‌ర్మిష‌న్ ఉందా..? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ అధికారి అనుమ‌తి ఉంద‌ని చెప్పడంతో సీఐ ఇరువురిని కోర్టులో చూసుకోమని చెప్పడం గమనార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణం...

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య...

హస్పుఖాన్ భవనం కూల్చివేత

హస్పుఖాన్ భవనం కూల్చివేత రాయిగూడెం గ్రామంలో కూల్చివేతపై ముస్లింల‌ ఆగ్రహం కాకతీయ, కూసుమంచి :...

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..! ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..? తప్పుడు...

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్ నిర్వ‌హ‌ణ‌లేని గ్రామ డంపింగ్ యార్డ్ కాకతీయ, ఏన్కూర్ :...

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కాకతీయ ఖమ్మం టౌన్ :...

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి పోనేక‌ల్లులో అత్యాధునిక వసతులతో భ‌వ‌న నిర్మాణాలు చదువు తో...

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ అత్యవసర సేవల నాణ్యతపై సమగ్ర పరిశీలన క్వాలిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img