కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి
ఏఐటీయూసీ జిల్లా నాయకులు కొమురయ్య
కాకతీయ,చిగురుమామిడి : భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని, ఈ నెల 24న జరిగే మండల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గందె కొమురయ్య, ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 24న చిగురుమామిడి మండల కేంద్రంలో నిర్వహించే భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశానికి మండలంలోని 17 గ్రామాల నుండి అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రైవేటు పరమయ్యే ప్రయత్నాలను ఖండించారు.
కేంద్ర విధానాలపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. పెండింగ్ క్లయిమ్లను వెంటనే పరిష్కరించాలని, కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పిట్టల తిరుపతి, జనుల కనకయ్య, పెనుకుల సదానందం, జిల్లెల్ల రమేష్, చిట్టెల మల్లేష్, అనూవోజు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


