పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేషన్ పరిశీలన
కాకతీయ,శంకరపట్నం: జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సాజీదా బుధవారం శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించి, అమలు విధానంపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ కార్యక్రమ నిర్వహణ, లక్ష్యాల సాధనపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రంలోని ఐఎల్‌ఆర్, వ్యాక్సిన్లు, వాటి నిల్వ విధానం, టెంపరేచర్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫార్మసిస్ట్ అర్చన వ్యాక్సిన్ల నిల్వ, పంపిణీ తదితర అంశాలపై వివరాలు అందించారు. ఎండాకాలం నేపథ్యంలో వ్యాక్సిన్ల నాణ్యత కాపాడేందుకు కోల్డ్ చైన్ వ్యవస్థను కచ్చితంగా నిర్వహించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సాజీదా సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్య అధికారి డా. సంద్యా, ఎంఎల్హెచ్‌పీ డా. శ్వేత, సూపర్వైజర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.


