కాకతీయ పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు పెద్దపల్లి మజీద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
10 నిమిషాలు మౌనం పాటించి వైఎస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండుటెండలను లెక్కచేయకుండా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ గ్రామ గ్రామాన పేద బడుగు బలహీన వర్గాల అవసరాలను గుర్తించి పార్టీని అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు.
హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. మాజీ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు నెత్తేట్ల కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు నదీమ్ నల్లగొండ కుమార్ ఫణీంద్ర భూపతి కళ్యాణ్ గంగుల రాకేష్ అడప సంతోష్ కళ్యాణ్ నక్క సంతోష్, తదితరులు పాల్గొన్నారు.


