ఎంజీఎంలో ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ సేవలు భేష్
ఉత్తమ సేవలందిచిన వారికి పురస్కారాలు
కాకతీయ, వరంగల్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక.. హెల్త్ వీక్ లో భాగంగా మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చంగ్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం యంజియం ఆసుపత్రి / కేయంసి ఆర్థోపెడిక్ విభాగం, నెఫ్రాలజీ విభాగంలకు అందజేశారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఆర్థోపెడిక్ విభాగము- 653 మందికి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగినది. అలాగే నెఫ్రాలజి విభాగం 24709 మందికి డయాలసిస్ సేవలు అందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్థోపెడిక్ విభాగము మరియూ నెఫ్రాలజీ విభాగంలకు చెందిన వైద్య సిబ్బందిని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక ఖర్చుతో కూడుకున్న కీళు మార్పిడి సర్జరీలని ఉచితంగా యం.జి.యం. ఆసుపత్రిలో రాష్ట్రస్థాయిలోనే అత్యధిక మంది పేద రోగులకు నిర్వహించడం, అలాగే నెఫ్రాలజీ విభాగంలో రాష్ట్ర స్థాయిలోనే అదికంగా డయాలసిస్ సేవలను అందించి రాష్ట్ర స్థాయి అవార్డు పొందడం అభినందననీయమైన విషయము అని పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రికి మిగతా విభాగాలకు చెందిన వైద్యులు కూడా మెరుగైన సేవలు అందించి పేద ప్రజలకు ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆసుపత్రిలోని సేవల విషయంలో గాని, మౌళిక సదుపాయాలలో కానీ, కావలసిన పరికరాల విషయంలో కానీ, ఇబ్బందులు ఉంటే, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొనివచ్చినచో ఆ సమస్యని తీర్చడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి అడిపినల్ కలెక్టర్ (లోకల్ బాడీస్ వి.వై.గణేష్, జిల్లా వైద్యాధికారి డా. సాంబశివ రావు, కేయంసి ప్రిన్సిపాల్, యంజియం ఆసుపత్రి సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. అనిల్ బాలరాజ్, ఆర్థోపెడిక్ హెచ్్వడి డా. రాంకుమార్ రెడ్డి, నెఫ్రాలజీ వైద్యులు డా. మల్లీశ్వర్, డా. కుమారస్వామి, ఇతర విభాగాల వైద్యాధికారులు, ఆర్యాంవోలు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


