epaper
Thursday, April 9, 2026
epaper

బ‌ల్దియాలో భారీ అవినీతి

బ‌ల్దియాలో భారీ అవినీతి
మున్సిపల్‌లో ప్ర‌తీ ప‌నికి బేరసారాలు
అక్యూపేష‌న్‌ సర్టిఫికెట్ల పేరుతో భారీ వసూళ్లు
పన్నులు, అడ్వర్టైజ్‌మెంట్ ఫీజుల వసూళ్లలో లోపాలు
ప్ర‌భుత్వ భూముల‌ను అమ్మ‌కానికి పెడుతున్నారు
చింతకుంట సర్వే నంబర్ 439లో ఉన్న రెండు ఎకరాలు అన్యాక్రాంతం
ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి విక్ర‌యిస్తున్నారు
మాజీ మేయ‌ర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు

కాకతీయ, కరీంనగర్ : నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీగా అవినీతి పెరిగిపోయింద‌ని కరీంనగర్ మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.బుధ‌వారం ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈసంద‌ర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ సోదాల్లో వెలుగులోకి వచ్చిన అవినీతి మాదిరిగానే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా పన్నులు, అడ్వర్టైజ్‌మెంట్ ఫీజుల వసూళ్లలో లోపాలు ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. బదిలీపై వచ్చే అధికారులు ‘గోన సంచులు’ తెచ్చుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు ఇబ్బందులు పెడుతూ, పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ప్రభుత్వ భూములపై రియల్ ఎస్టేట్ దందా

నగరంలో విలీనమైన గ్రామాల్లో కొత్తగా అక్రమాల దందా ప్రారంభమైందని ఆరోపించారు. చింతకుంట ప్రాంతంలోని సర్వే నంబర్ 439లో ఉన్న రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి బహిరంగంగా అమ్ముతున్నారని తెలిపారు. ఇదే తరహాలో అల్గునూరు ప్రాంతంలోనూ ప్రభుత్వ, సాగుభూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి కాంపౌండ్ గోడలు కట్టి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలన్నింటికీ టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారం ఉందని ఆరోపించారు.

ఓ సి సర్టిఫికెట్ల పేరుతో భారీ వసూళ్లు

అపార్ట్‌మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినా, ఒక్కో ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కోసం రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. రెండుసార్లు తిరస్కరించిన ఫైల్, డబ్బులు ఇచ్చిన తర్వాత ఎలా ఆమోదం పొందుతుందో ప్రశ్నించారు.మున్సిపల్ బడ్జెట్ కంటే అవినీతి ఆదాయం ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇటీవల కమిషనర్ లేకుండానే కేంద్ర మంత్రి బండి సంజయ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం అవినీతి అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ లేఅవుట్లు, భూముల మార్పిడి వ్యవహారాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు. నగరంలో ఒక్క ఇంచ్ ప్రభుత్వ భూమి అక్రమానికి గురైనా ఊరుకోమని, బీఆర్ఎస్ తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..!

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..! కాకతీయ, వేములవాడ :...

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేష‌న్ ప‌రిశీల‌న‌

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేష‌న్ ప‌రిశీల‌న‌ కాకతీయ,శంకరపట్నం: జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సాజీదా...

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్ కాకతీయ, కరీంనగర్ : పశ్చిమ బెంగాల్...

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి కాకతీయ, చిగురుమామిడి : గ్రామస్తులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు...

జీఎస్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా భూమా అరవింద్

జీఎస్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా భూమా అరవింద్ కాకతీయ,శంకరపట్నం : మండలంలోని గద్ధపాక గ్రామానికి చెందిన...

17న హిందూ మహాసమ్మేళనం

17న హిందూ మహాసమ్మేళనం హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మిర్యాల నరసింహారెడ్డి కాకతీయ, కరీంనగర్...

ఆదర్శంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి

ఆదర్శంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నాలుగు అవార్డులతో మరోసారి ప్రతిభ వైద్య సిబ్బందికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img