epaper
Saturday, April 11, 2026
epaper

ఇసుక రవాణాపై అక్రమ పోలీసుల ఉక్కుపాదం

ఇసుక రవాణాపై అక్రమ పోలీసుల ఉక్కుపాదం
మార్చిలో 120 కేసులు నమోదు.. 139 వాహనాలు స్వాధీనం
161 మందిపై చర్యలు
వివ‌రాలు వెల్ల‌డించిన క‌రీంన‌గ‌ర్ సీపీ గౌస్ ఆలం

కాకతీయ, కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. మార్చి నెలలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 120 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 139 వాహనాలను స్వాధీనం చేసుకుని, 161 మంది నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా, పర్యావరణం, రోడ్డు భద్రత, ప్రజా శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం పడుతున్నందున చర్యలు మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.
డివిజన్ వారీగా చూస్తే రూరల్ డివిజన్‌లో అత్యధికంగా 73 కేసులు నమోదై 79 వాహనాలు స్వాధీనం కాగా, 98 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. హుజురాబాద్ డివిజన్‌లో 32 కేసులు నమోదు చేసి 48 వాహనాలు స్వాధీనం చేసుకుని 48 మందిపై చర్యలు తీసుకున్నారు. టౌన్ డివిజన్‌లో 15 కేసులు నమోదు చేసి 12 వాహనాలు స్వాధీనం చేసి 15 మంది నిందితులను గుర్తించారు. పోలీస్ స్టేషన్‌ల వారీగా కరీంనగర్ రూరల్ స్టేషన్ పరిధిలోనే అత్యధికంగా 28 కేసులు నమోదై 36 వాహనాలు స్వాధీనం కావడం గమనార్హం.


ఈ ఏడాది మార్చి వరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 245 కేసులు నమోదు కాగా, 357 వాహనాలను స్వాధీనం చేసుకుని, 422 మంది నిందితులపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ ఇసుక తవ్వకం, రవాణా, నిల్వ, విక్రయాల్లో పాల్గొనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇలాంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించము. సంబంధిత పోలీస్ స్టేషన్‌ల పరిధిలో తనిఖీలు, నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అని పోలీస్ కమిషనర్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సన్న బియ్యం పంపిణీపై పరిశీలన కాకతీయ,...

తహసీల్దార్ కార్యాలయానికి తాళం

తహసీల్దార్ కార్యాలయానికి తాళం బదిలీలతో కీలక పోస్టులు ఖాళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామగుండం ప్రజలు కాకతీయ,...

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు ప‌ద్నాలుగేళ్లుగా ప‌రారీలో నిందితుడు భార్య, ఇద్దరు చిన్నారుల మృతికేసులో చేధ‌న‌...

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు కేసీఆర్ కప్ క్రికెట్...

ఇల్లంద‌కుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు

ఇల్లంద‌కుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కానుకలు కాకతీయ, జమ్మికుంట/ఇల్లందకుంట...

దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం

దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం జమ్మికుంట–వీణవంక రోడ్డుపై ప్రతిష్టాపనకు నిర్ణయం హుజూరాబాద్ కాంగ్రెస్...

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : క‌లెక్టర్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img