వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
విద్యుత్ శాఖ ఎస్ఈ గౌతమ్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ : వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించా లని విద్యుత్ శాఖ ఎస్ఈ గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పిడిఆర్ ఫంక్షన్ హాల్లో వరంగల్ రూరల్ డిఈ దానయ్య ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్ఈ గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని,లైన్ మెయింటెనెన్స్ పనుల్లో అప్రమత్తంగా వ్యవహ రించాలని తెలిపారు. కాంట్రాక్టర్లు పనులలో జాప్యం లేకుండా నాణ్యమైన పనులు నిర్వహించాలని సూచించారు.అలాగే వినియోగదారులతో సానుకూలంగా వ్యవహరించి సేవల నాణ్యతను పెంచాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ డిఈ మల్లికార్జున్,ఏడీఈలు, సబ్ డివిజన్ ఏఈలు,లైన్మెన్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


