మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
26 క్వింటాళ్ల నిబంధన రద్దు చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
కాకతీయ, బోనకల్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, 26 క్వింటాళ్ల కొనుగోలు నిబంధనను ఎత్తివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం రైతులు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. గతంలో ఉన్న కొనుగోలు కేంద్రాలను యథావిధిగా తిరిగి ప్రారంభించాలని కోరారు. పండిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని తెలిపారు. సాగర్ నీటిని మే 15 వరకు విడుదల చేయాలని కోరారు. ధర్నా అనంతరం సీపీఎం రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యలను వివరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అంశాలపై ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సమస్యను పార్టీ శాఖ కార్యదర్శి తమ్మారపు లక్ష్మణ్ రావు ప్రస్తావించారు. లక్ష్మీపురం సహకార సంఘం పరిధిలో గతంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం రైతులకు ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎకరాకు 45 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని వివరించారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆ ప్రాంతాన్ని ముందుగా పరిశీలించానని తెలిపారు. అక్కడ మొక్కజొన్న దిగుబడి అధికంగా ఉంటుందని తెలిసిందన్నారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నున్న నాగేశ్వరరావు, బండి రమేష్, బొంతు రాంబాబు, వాసిరెడ్డి వరప్రసాద్, మీరా సాహెబ్, కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు, కొమ్ము శ్రీనివాసరావు, తుళ్లూరు రమేష్, కిలారు వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ సునీత, గుడ్డురి ఉమా, నల్లమోతు వాణి, కోసూరి శ్రీనివాసరావు, పెంట్యాల రాధా, నల్లమోతు నాగేశ్వరరావు, పుచ్చకాయల బ్రహ్మం, పుచ్చకాయల తిరుపతయ్య, పసుపులేటి నాగేశ్వరరావు, సాదం శ్రీనివాసరావు, కురిసెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


