ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండలాధ్యక్షుడు ఎనుగుల అనీల్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎనుగుల అనీల్, 1980లో స్థాపితమైన బీజేపీ క్రమశిక్షణతో ముందుకు సాగుతూ, నేడు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని విస్తరించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, గద్దపాక ఉపసర్పంచ్ జంగ జైపాల్, పార్టీ నాయకులు దొంగల రాములు, దాసరపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, గౌరవేణి శ్రీనివాస్, ఎల్కపల్లి సంపత్, వడ్లకొండ రాజేందర్, మొలంగూరి ప్రశాంత్, బొజ్జ సాయి ప్రకాష్, పోతునూరి రాజు, కుమార్, రవి, రంజీత్, సందీప్, స్వామి తదితరులు పాల్గొన్నారు.


