రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..
కాకతీయ, గీసుగొండ: అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ పురాణాపూల్ బహదూర్ పురాకు చెందిన భూక్య రవి 4-4-2026న తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురం ఇప్పతండాకు వచ్చి,5-4-2026 రాత్రి సుమారు 11:30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మార్గంమధ్యలో గీసుగొండ మండలంలోని హర్జతండా గ్రామంలోని ఓంకార్ స్తూపం మూలమలుపు వద్దకు రాగానే,దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామానికి చెందిన పొన్నం వంశీ తన టాటా ఏసీ వాహనంలో వరంగల్ వైపు నుండి నర్సంపేట వైపుకు వస్తూ అతివేగంగా,నిర్లక్ష్యంగా నడిపి రవి వాహనాన్ని ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో రవి రోడ్డుపై పడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి తమ్ముడు భూక్య కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టాటా ఏసీ డ్రైవర్ వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు.


