“సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో జాప్యం”
కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే ఫోర్ గడ్డ శాంతి నగర్ లైన్ పక్కన నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు కొన్ని రోజులుగా నిలిచిపోయినట్లు అక్కడి ప్రజలు చెప్తున్నారు. అలాగే కాలువ మొదటి నుంచి చివరి భాగం వరకు పూర్తి చేసి మధ్యలో ఓ ఐదు ఇండ్ల ముందు డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టలేదంటున్నారు. కాగా ఇదే విషయంపై మున్సిపల్ ఏఈ ఆశ్రిత్ ను ‘కాకతీయ’ వివరణ కోరగా త్వరలోనే పెండింగ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయిస్తామని చెప్పారు. అక్కడ చెట్ల మొదట వేర్ల కారణంగా ఆలస్యం అవుతుందన్నారు.


