గాలికుంటు నివారణకు టీకాలు తప్పనిసరి
మండల పశు వైద్యాధికారి డాక్టర్ అన్వేష్
కాకతీయ, బోనకల్ : గాలికుంటు వ్యాధి నివారణకు ముందస్తుగా టీకాలు వేయించడం ద్వారా పశువులను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించవచ్చని మండల పశు వైద్యాధికారి డాక్టర్ అన్వేష్ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మండల పరిధిలో మోటమర్రి గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ మర్రి సురేష్ ప్రారంభించారు. శిబిరంలో 87 పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. గ్రామ రైతులకు పశు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. పశువులకు సమయానికి టీకాలు వేయించడం ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి శిబిరాలను మరింతగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రైతులు చురుకుగా పాల్గొని పశువుల సంరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు.


