రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం
– మొక్కజొన్న పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తాం
– మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి
కాకతీయ, దుగ్గొండి: రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని, మొక్కజొన్న పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తాం అని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ప్రాధమిక సహకార సంఘం మహమ్మదాపురం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద అమ్మకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ 2400 వందలు అందించడం జరుగుతుందని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, తహసీల్దార్ ముస్కు సమ్మక్క, సర్పంచ్ పొగాకు శోభ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ మాటేటి రవి, మార్కెట్ డైరెక్టర్ రామారావు, మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓలిగే నర్సింగరావు, మండల నాయకులు మట్ట రాజు, బండారి ప్రకాష్, బూర హేమ చందర్ గౌడ్, ముత్యాల కుమారస్వామి, మాదసి సాంబయ్య, మరియు అధికారులు మండల ముఖ్య నాయకులు గ్రామ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.


