శ్రీరామదళ్ నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్
కాకతీయ, నర్సంపేట: శ్రీరామ దళ్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్ ను నియమించినట్లు శ్రీరామ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు వినయ్ రెడ్డి మాట్లాడుతూ
సంస్థ పట్ల నిబద్ధత, హిందూ ధర్మ పరిరక్షణలో చూపించిన సేవలు, యువతలో ఉత్తేజాన్ని నింపేందుకే నియోజకవర్గ కన్వీనర్ గా ఎన్నుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో శ్రీరామ దళ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి, సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కన్వీనర్ కన్నబోయిన రమేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ అభివృద్ధి మరియు ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామ దళ్ రాష్ట్ర కాశాధికారి మచ్చిక రవితేజ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొరటాల శ్రీనివాసరావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.


