epaper
Tuesday, April 7, 2026
epaper

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి

– సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో కాంగ్రెస్ శ్రేణుల నిరసన
– కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వెంటనే ఇవ్వాలని డిమాండ్
– స్పందించకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ ముట్టడిస్తామని హెచ్చరిక
– ఎమ్మెల్యేగా కొనసాగేందుకు కేసీఆర్‌కు నైతిక హక్కు లేదని ఆగ్రహం
– గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్

కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజలను గాలికి వదిలేసిన కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు నైతిక హక్కు లేదు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట అంక్షారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్న ఆయన తీరును తీవ్రంగా ఖండించారు. గజ్వేల్ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు శనివారం కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించి బీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కేసీఆర్ ఇప్పటికే రూ.1.20 కోట్లకు పైగా వేతనం, అలవెన్సులు పొందినప్పటికీ ప్రజలకు సేవ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అంక్షారెడ్డి ఆరోపించారు. ప్రజల సొమ్మును వినియోగించుకుంటూ వారిని నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు. వెంటనే ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయిందని, ఇందుకు కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు.

గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారంలో కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ముంపు బాధితులను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడించేందుకు వెనుకాడం అని హెచ్చరించారు. అలాగే కేసీఆర్ క్యాంపు కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపిస్తూ, జిల్లా కలెక్టర్ వెంటనే ఆ కార్యాలయాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఇతర నాయకులు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు గ‌జ్వేల్ ఘ‌ట‌న ప్రజాస్వామ్యంపై దాడే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై...

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు సీఎం విజిట్ పేరుతో హడావిడిగా...

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం * సీఐ రమేష్ నాయక్ కాకతీయ, చేర్యాల: వేసవిలో దాహం...

ప్రేమ వివాహం విషాదాంతం

ప్రేమ వివాహం విషాదాంతం మొన్న ప్రియుడు.. నేడు ప్రియురాలు ఆత్మ‌హ‌త్య‌ చేర్యాల మండలం ముస్త్యాల...

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి * సీఎం రేవంత్ రెడ్డికి లేఖ...

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి * కరపత్రాల ఆవిష్కరణ చేసిన కమిటీ సభ్యులు కాకతీయ,చేర్యాల:చేర్యాల...

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు * రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ,చేర్యాల:...

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి * విద్యార్థి కీర్తన మృతి పట్లv సంతాపాన్ని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img