epaper
Friday, April 10, 2026
epaper

ప్రజా తీర్పుతో ఆటలు ఆడొద్దు

ప్రజా తీర్పుతో ఆటలు ఆడొద్దు
ప్ర‌జాస్వామ్యంపై న‌మ్మ‌కం కోల్పోనివ్వ‌ద్దు
కాంగ్రెస్ ఉద్దేశ పూర్వ‌కంగానే క్యాతనపల్లి మున్సిపల్‌లో వివాదం
కౌన్సిలర్లపై ఒత్తిళ్లు కొన‌సాగాయి.. ప్రలోబాల‌కు గురి చేశారు
మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపాటు
పాపపు పాలనగా మారింది : బాల్క సుమన్

కాకతీయ, కరీంనగర్ : ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం దెబ్బతినకుండా ప్రభుత్వం వ్యవహరించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని శ్వేతా హోటల్లో మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, ఆ తీర్పును వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కౌన్సిలర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం ద్వారా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, సీపీఐలకు స్పష్టమైన మెజారిటీ ఉందని తెలిపారు.

పాపపు పాలనగా మారింది : బాల్క సుమన్

మాజీ ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ, ఇది ప్రజాపాలన కాదని, పాపపు పాలనగా మారిందని మండిపడ్డారు. క్యాతనపల్లి చైర్మన్ పీఠం కోసం ప్రభుత్వం, జిల్లా మంత్రి కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గెలిచిన ప్రజాప్రతినిధులను బెదిరించడం, పోలీసు బలంతో నిర్బంధించడం వంటి చర్యలు ప్రజలకు తెలిసినవేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజా తీర్పు ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుకూలంగా లేదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధిక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం భారీ అప్పులు చేసి ప్రజా సంక్షేమానికి వినియోగించడం లేదని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధి నిలిచిపోయిందని, మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టులతో నగరాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : క‌లెక్టర్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్ కాక‌తీయ‌,...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ,శంకరపట్నం :...

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి ఏఐటీయూసీ జిల్లా నాయకులు కొమురయ్య కాకతీయ,చిగురుమామిడి : భవన...

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం ఏప్రిల్ 16...

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి ప్రజా సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలి సిపిఎం...

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి మెరుగైన వైద్యం అందించాలి ఆరోగ్య అవగాహన కల్పించాలి కలెక్టర్ గరిమ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img