epaper
Friday, April 3, 2026
epaper

లిస్ట్ రెడీ ?

లిస్ట్ రెడీ ?
క‌మిష‌న‌రేట్‌లో ఇన్ష్‌స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం?
అతి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వుల జారీకి స‌న్న‌ద్ధం..!
ఎవరికెక్కడ పోస్టింగ్ అన్న‌దానిపై ఉత్కంఠ‌
రెండేళ్ల తర్వాత భారీగా మార్పులు!
కీలక పోస్టింగ్‌లపై కొన‌సాగుతున్న సస్పెన్స్
బ‌దిలీలు ఉండే అవ‌కాశంపై డిపార్ట్మెంట్‌లో జోరుగా చ‌ర్చ‌

కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ల‌ బదిలీల‌కు రంగం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌ఫ‌ర్స్ లిస్ట్ రెడీ అయింద‌ని.. సీపీ ప్ర‌క‌ట‌నే త‌ర్వాయి.. అని పోలీస్ శాఖ‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌త రెండు సంవత్సరాలుగా ఒకే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ప‌లువురికి ఈసారి స్థాన‌చ‌ల‌నం క‌ల‌గ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది. రెండేళ్ల తర్వాత భారీగా మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉండ‌టంతో అధికారుల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికెక్కడ పోస్టింగ్ ద‌క్కుతుందో అన్న ఆస‌క్తి నెల‌కొంది. కీలక పోస్టింగ్‌ల కోసం ఇంత‌కాలం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన పలువురు ఆఫీస‌ర్ల ప్ర‌యత్నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయ‌నే సస్పెన్స్ కొన‌సాగుతోంది. ఇదే అంశం ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన సిఫార్సుల లేఖలు ఉన్నతాధికారుల వద్దకు చేరుకున్నాయని, కొన్ని ఫైల్స్‌పై సంతకాలు కూడా పూర్తయ్యాయని సమాచారం. అయినప్పటికీ తుది ఆదేశాలు ఆలస్యం కావడం అనుమానాలకు తావిస్తోంది.

చివరి క్షణం మార్పులే అడ్డంకా ?

విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఇన్స్పెక్టర్ల బదిలీల జాబితా దాదాపు ఫైనల్ దశకు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అయితే కొన్ని కీలక స్టేషన్ల పోస్టింగ్‌ల విషయంలో చివరి నిమిషంలో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నగరంలోని సెన్సిటివ్ పోలీస్ స్టేషన్లకు ఎవరిని నియమించాలి అనే అంశంపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ బదిలీల ప్రభావం పోలీస్ శాఖ పనితీరుపై కూడా కనిపిస్తున్నట్లు సమాచారం. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియక అధికారులు కొంతమంది నిరీక్షణలో ఉండగా, మరికొందరు తమకు అనుకూలమైన ప్రాంతాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజకీయ సిఫార్సులు కీలకం?

బదిలీల్లో రాజకీయ ప్రభావం ఉందనే చర్చ సాగుతోంది. జిల్లాస్థాయి ప్రముఖులు తమకు అనుకూలమైన అధికారులను తమ ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు నేరుగా ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రాన్స్ఫర్ల విషయంపై ప్రతి రోజు కొత్త ప్రచారాలు వస్తున్నాయి. పోలీస్ శాఖలో పరిచయాలు ఉన్న వారు, రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, అందరూ తమకు తెలిసిన అధికారులను సంప్రదిస్తూ తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కమిషనరేట్ చుట్టూ ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది.

నేడా..? రేపా..?

ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఎప్పుడైనా బదిలీల జాబితా విడుదల అయ్యే అవకాశముందని తెలుస్తోంది. నేడా? రేపా? అన్న ఉత్కంఠతో పోలీస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఒకసారి ఉత్తర్వులు వెలువడితే కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా ఒకే పరిధిలో పని చేస్తున్న అధికారులను మార్పు చేయాల్సిన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఇది పారదర్శకత, పనితీరు మెరుగుదలకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్న అంశంగా మారింది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ఉత్కంఠ ఇలానే కొనసాగ‌నుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ గుడ్ ఫ్రైడేను పుర‌స్క‌రించుకుని సేవా కార్యక్రమాలు కాకతీయ, తొర్రూర్ (నెల్లికుదురు):...

జోరుగా ఇసుక అక్రమ రవాణా

జోరుగా ఇసుక అక్రమ రవాణా ఏటూరునాగారంలో రాత్రి వేళ‌ల్లో ట్రాక్ట‌ర్ల‌తో ఇసుక త‌ర‌లింపు గ్రామ‌స్థులు...

పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య‌ నిరసన

పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య‌ నిరసన త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న...

కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం

కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం ఆలయం చుట్టూ బండ్ల ప్రదక్షణ భక్తి పారవశ్యం వేద...

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం ఇప్ప‌టికే కార్యాచరణ ప్రారంభించాం పూడికతీత పనులతో నిల్వ సామర్థ్య...

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి వైద్యులు సమయపాలన పాటించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డా....

లడే తిరుపతి బడా మోసం?

లడే తిరుపతి బడా మోసం? ఏనుమాముల వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం! బోర్డు తిప్పేసిన...

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!? బోర్డు తిప్పేసిన పెద్ద వ్యాపారి.. ఐపీ పెట్టినట్లు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img