కాకతీయ ,బయ్యారం: యూరియా కోసం బయ్యారం మండల రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియా లేక పంటలు ఎదుగుదల లేదని చావనైన చస్తాం కానీ యూరియా రాకుంటే వదిలేది లేదని సొసైటీ వద్ద ఇల్లేందు మహబూబాద్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహిస్తూ ఆందోళన బాటపట్టారు. గణపతి పప్పా, రైతులకు యూరియా కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శాంతి భద్రతల నేపథ్యంలో స్తానిక ఎస్ ఐ తిరుపతి రైతులకు యూరియా వచ్చే విధంగా అధికారులతో మాట్లాడి యూరియా అందించేందుకు కృషి చేస్తామని,నచ్చ చెప్పిన ప్పటికి రైతులు ఆందోళన విరమించకుండా ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూరియా రైతులకు పంపిణి చేసే వరకు, జిల్లా కలెక్టర్ దీనిపై సమాధానం చెప్పే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బయ్యారం,వెంకట్రాం పురం, ఇర్సులాలాపురం, గంధంపల్లి రైతులు తదితరులు పాల్గొన్నారు.




