దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి
సామాజిక న్యాయం కోసం పోరాటం ఆదర్శం
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ
కాకతీయ,ఖమ్మం : దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని అన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచారని తెలిపారు. వారి ధైర్యం, త్యాగం సమాజానికి ఆదర్శమని చెప్పారు. రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా గుర్తుంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, తెలంగాణ జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, బీసీ సంఘ నాయకులు కూరాకుల నాగభూషణం, కురుమ సంఘ జిల్లా అధ్యక్షులు మాయర గంగయ్య, గౌరవ సలహాదారు చావళ్ల నాగేశ్వరరావు, కోడి లింగయ్య, చిత్తారు ఇందుమతి, గూడె మల్లయ్య, భూక్యా శోభా నాయక్, కొరిపల్లి శ్రీనివాస్, పెల్లూరి విజయ్ కుమార్, సాదిక్ అలీ, మేకల సుగుణా రావు, చావల నాగరాజు, మూడుముంతల గంగరాజు, తమ్మారపు బ్రహ్మయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


